calender_icon.png 23 October, 2024 | 4:48 AM

నిజాయితీ చాటుకున్న మహిళను అభినందించిన ఎస్ఐ

22-07-2024 12:24:39 PM

మంథని,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో నీర్ల విజయకు అదే గ్రామానికి చెందిన చెలుపురి రాజమౌళి బండి మీద వెళుతుండగా సెల్ ఫోన్ పాకెట్ లోనుంచి జారిపోగా రూ. 80000 వేల విలువగల ఫోన్ నీర్ల విజయకు దొరకగా, ఆమె రామగిరి ఎస్ఐ సందీప్ కు తెలపగా పోలీస్ స్టేషన్ లో సోమవారం రాజమౌళికి సెల్ ఫోన్ అందజేశారు. నిజాయితీ చాటుకున్న మహిళను ఎస్ఐతో పాటు మాజీ జెడ్పిటిసి గంట వెంకట రమణరెడ్డి అభినందించారు.