calender_icon.png 31 January, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

31-01-2025 11:15:02 AM

పశ్చిమ గోదావరి,(విజయక్రాంతి): తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం రేపింది. తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తుణుకులో ఎస్ఐగా పని చేస్తున్న ఎజీఎస్ మూర్తి ఇటీవల సస్పెన్షన్ కు గురయ్యారు. గేదెల అపహరణ కేసులో మూర్తిపై పలు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం పెనుగొండలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మూర్తి కొంతసేపు పీఎస్ దగ్గరే కూర్చొన్నాడు. అనంతరం బాత్ రూమ్ లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.కాల్పుల శబ్ధం విన్న పోలీసులు హుటహూటిన అక్కడికి వెళ్లి చూసేసారికే మూర్తి చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.