calender_icon.png 3 April, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్లు సేకరించి బాధితులకు అందించిన ఎస్సై

02-04-2025 08:34:15 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ సాఫ్ట్వేర్ పోర్టల్ ద్వారా గుర్తించి ఇద్దరు బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోనులను సేకరించి బుధవారం బాధితులకు అందించినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేశ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డికి చెందిన నెల్లి జ్యోతి తన రెడ్మీ రకం ఫోను గత సంవత్సరం అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేసిందని, అదేవిధంగా భీమారి రాజశేఖర్ తన రియల్మీ రకం సెల్ ఫోను ఈ ఏడాది జనవరి 19న ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో పోగొట్టుకున్నట్లు బాధితుడు ఫిర్యాదు చేశారని తెలిపారు.

వారి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని అధునాతన సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ సాఫ్ట్వేర్ పోర్టల్ ద్వారా గుర్తించి ఇద్దరు బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోనులను సేకరించి బుధవారం బాధితులకు అందించినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేశ్ తెలిపారు. సాఫ్ట్వేర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి సెల్ఫోన్లను గుర్తించి బాధితులకు అందించామని ఎస్ఐ తెలిపారు.