19-04-2025 12:00:00 AM
గుప్త నిధులకు సంబంధించిన కేసులో బాధితుడిని ఇబ్బందిపెడుతున్న ఎస్‌ఐ
కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించిన వైనం
ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ వెల్లడి
మంచిర్యాల, ఏప్రిల్ 18 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీసు స్టేషన్‌లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎస్‌ఐపై కేసు నమోదు చేసిన సం ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాలో గుప్త నిధులకు సంబంధించిన వ్యవహారం లో జనవరి 25న నస్పూర్ పోలీసులు కేసు నమోదు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా రు. ఈ కేసుకు సంబంధించి కోర్టు సీజ్ చేసి న రూ.2లక్షలు తనకు ఇవ్వాలని బాధితుడు ప్రభంజన్ కోర్టుకు విజ్ఞప్తి చేయగా అతని డబ్బులు అతనికి ఇవ్వాలంటూ కోర్టు ఈ నెల 4న ఆదేశాలు జారీ చేసింది.
దీనితో బాధితుడు సీసీసీ ఎస్‌ఐ నెల్కి సుగుణాకర్‌ను కలిసి తన డబ్బులు తనకు ఇవ్వాలని కోరాడు. పది రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎస్‌ఐ తనకు ఈ కేసుకు సంబంధించి వివిధ పనులకు రూ. 1.50 లక్షలు ఖర్చయ్యాయని, తన వద్ద రూ. 50 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పి, బాధితుడికి రూ. 2లక్షలు ఇస్తున్నట్లుగా ఒక ఫోటో తీసి, కొంత సమయం తర్వాత తనను కలవమని ఫిర్యాదుదారునికి చెప్పి ఏమి ఇవ్వకుం డా వెళ్లిపోయాడు. బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండగా ఈ నెల 10వ తేదీన డబ్బులు చెల్లిస్తానని ఎస్‌ఐ స్టేషన్‌కు పిలిపించి రూ.50 వేలు మాత్రమే ఉన్నాయని తీసుకొని వెళ్లాల్సిందిగా ఒత్తిడి చేసేటప్పుడు ఎస్‌ఐ మాట్లాడిన మాటలను ప్రభంజన్ రికార్డు చేసుకొని ఏసీబీకి అందజేశారన్నారు.
ఇలా బాధితున్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఎస్‌ఐ సుగుణాకర్‌ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. మరోవైపు కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే కాకుండా, బాధితున్ని ఇబ్బందులకు గురి చేశాడనే ఆరోపణలపై అతన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితునికి డబ్బులు చెల్లించకుండా, సొంతానికి వినియోగించుకున్న అందుకు కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ అధికారులు స్వామి, కిరణ్ పాల్గొన్నారు.