09-04-2025 02:29:18 AM
పీడీఎస్ బియ్యం కేసులో లంచం డిమాండ్
పది వేలు తీసుకుంటూ ఏసీబీ వలలో
ఇంట్లోనూ కొనసాగుతున్న సోదాలు
చింతలపాలెం ఏప్రిల్ 8 : పిడిఎస్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ కోసం పదిహేను వేలు డిమాండ్ చేసి పది వేలు లంచం తీసుకున్న చింతలపాలెం ఎస్త్స్ర అంతిరెడ్డి ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపిన వివరాల మేరకు గతంలో పిడిఎస్ బియ్యం రవాణా చేస్తూ దొరికిన కేసులో ఆంధ్రా కు చెందిన బాధితుడు కు స్టేషన్ బెయిల్ కోసం చింతలపాలెం ఎస్త్స్ర అంతిరెడ్డి పదిహేను వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు నల్గొండ ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడు వద్ద పది వేలు లంచం తీసుకుంటున్న ఎస్త్స్ర ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో కూడా ఎస్త్స్ర మీద పలు ఆరోపణలు వచ్చాయని. పోలీస్ స్టేషన్, ఎస్సై ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నామని. ఎస్సైను అదుపులోకి తీసుకొని నాంపల్లి కోర్టులో అదనపు న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తామని నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు.