calender_icon.png 9 February, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షట్టర్ లిఫ్టింగ్ దొంగల అరెస్టు

09-02-2025 01:10:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి):  రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు దుకాణాల్లో షటర్లు లిఫ్ట్ చేసి మొబైల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతుండడంతో అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.

రాజస్థాన్ కు చెందిన ప్రభాత్ సింగ్ (24), నేపా ల్ సింగ్ (25), తరుణ్‌పాల్ సింగ్ (22),ప్రవీణ్ సింగ్‌లు హైదరాబాద్ బేగంబజార్ ప్రాంతంలో నివాసముంటున్నారు. కేవలం మొబైల్ షాపుల మ్మే షట్టర్‌లను మాత్రమే తొలగించి కొత్త ఫోన్లను దొంగిలించి విక్రయాల కు పాల్పడుతుంటారు.

ఆ సమయం లో అడ్డు వచ్చిన వారి కంట్లో కారం చల్లి, రాడ్డుతో దాడి చేసేందుకు సిద్దం గా ఉంటారు. ఈ నెల 3వ తేదీన మీర్‌పేట, 4న పోచారం ఐటీ కారిడార్ పీ ఎస్ పరిధిలోని మొబైల్ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు.

కాగా నిందితు ల నుంచి 60 మొబైల్ ఫోన్లు సహా మొత్తం రూ. 11.75 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. కేసు విచారణలో కీలకపాత్ర పోషించిన మల్కాజిగిరి సీసీఎస్ ఎస్‌హెచ్‌ఓ జలంధర్, సాయికుమార్, నర్సింహు లు, లవకుమార్, తదితరులను సీపీ అభినందించారు.