12-02-2025 03:52:54 PM
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Indian opener Shubman Gill) మరో మైలురాయిని సాధించాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో (ODIs) అత్యంత వేగంగా 2,500 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గిల్ నిలిచాడు. కేవలం 50 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Indian captain Rohit Sharma) కేవలం ఒక పరుగుకే అవుట్ కావడంతో ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
అయితే, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ మధ్య బలమైన భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. ఇటీవల ఫామ్‌లో ఇబ్బంది పడుతున్న కోహ్లీ అర్ధ సెంచరీ (52) సాధించగా, గిల్ ఈ సిరీస్‌లో వరుసగా మూడో అర్ధ సెంచరీ చేశాడు. ఈ జంట రెండవ వికెట్‌కు 116 పరుగుల ఘన భాగస్వామ్యాన్ని నిర్మించి, భారత ఇన్నింగ్స్‌ను స్థిరపరిచింది. దూకుడుగా ఆడిన గిల్ 95 బంతుల్లో సెంచరీ బాదాడు. మార్క్ వుడ్ వేసిన 31.2 ఓవర్ కు ఫోర్ బాది మూడంకెల స్కోర్ ను అందుకున్నాడు. గిల్ కిది 50 వ వన్డే మ్యాచ్ కాగా, 7వ సెంచరీ. అటు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యార్(Indian Batter Shreyas Iyer) కూడా దూకుడుగా ఆడుతున్నారు.