calender_icon.png 16 November, 2024 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ గిల్.. తొలి టెస్టుకు దూరం?

16-11-2024 04:09:09 PM

భారత జాతీయ క్రికెట్ జట్టుకు గాయాల బెడద వెంటాడుతూనే ఉంది. స్టార్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మాన్ గిల్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి ముందు తీవ్రమైన గాయంతో బాధపడ్డాడు. భారత జట్టులో కీలక బ్యాటర్ అయిన శుభ్‌మాన్ గిల్ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే పెర్త్ టెస్టు సిరీస్‌కి దూరం కానున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెర్త్‌లో ఇండియా ఏతో జరిగిన మ్యాచ్ సిమ్యులేషన్ సమయంలో స్లిప్స్‌లో క్యాచ్‌ను తీసుకుంటుండగా గిల్ వేలికి గాయమైంది. అతని వేలికి గాయం కావడంతో నవంబర్ 22 నుండి పెర్త్‌లో జరగనున్న టెస్ట్ సిరీస్ ఓపెనర్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనున్న రెండో టెస్టులో స్టార్ బ్యాటర్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌తో తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్టార్ టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ 2024లో టెస్ట్ క్రికెట్‌లో భారత జాతీయ క్రికెట్ జట్టు తరపున మంచి ఆటతీరును కనబరుస్తూ టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషించాడు.