calender_icon.png 1 February, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రైన్‌లో శ్రుతి

29-01-2025 12:00:00 AM

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ట్రైన్’. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైన్ ప్రయాణం చుట్టూ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

శ్రుతి హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్శకుడు మిస్కిన్ మంగళవారం ‘ట్రైన్’ సినిమా పోస్టర్‌ను షేర్ చేశారు. పోస్టర్‌లో శ్రుతి హాసన్ బైక్‌పై స్టులిష్‌గా కూర్చొని సీరియస్‌గా చూస్తున్నట్టుగా ఉంది ఆమె లుక్. దీనికి శ్రుతి ధన్యవాదాలు తెలిపింది.

అయితే ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఏ పాత్రలో నటిస్తోందన్నది మాత్రం తెలియరాలేదు. శ్రుతి ఒక పాట కూడా ఈ చిత్రం కోసం పాడింది. విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆమె ప్రస్తుతం ‘కూలీ’ చిత్రంలోనూ నటిస్తోంది.  సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.