calender_icon.png 18 November, 2024 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం మల్లన్న@బుక్ ఆఫ్ రికార్డ్స్

14-09-2024 12:05:06 PM

శ్రీశైలంజ్యోతిర్లింగాలలో  ఒకటైన శ్రీశైలం భ్రమరాంభ సహిత మల్లికార్జున ఆలయానికి అరుదైన పురస్కారం అందుకున్నారు. ఆలయానికి విస్తీర్ణం, ఆలయానికి నంది విగ్రహానికి ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దొరకడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెద్దిరాజు ధృవీకరణ పత్రం అందుకున్నారు. నంది విగ్రహహానికి ఉన్న పురాతన చరిత్ర ఆధ్యాత్మికంగా పౌరాణిక ప్రాముఖ్యత కలిగి ఉన్నందుకు గానూ భ్రమరాంభ సహిత మల్లికార్జున  ఆలయానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దొరికిందని ఆలయ ఈవో పెద్ది రాజు తెలిపారు. ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బొడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో పెద్ది రాజు లకు  ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ జాయింట్ సెక్రటరీ అల్లాజీ ఎలియజర్ అందజేశారు. భక్తులకు కొంగు బంగారమైన  భ్రమరాంభ సహిత మల్లికార్జున ఆలయానికి నందీశ్వరునికి  ఈ గౌరవం దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణం అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు.