21-04-2025 10:36:28 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సహోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శీను బాబు పలు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. మండలంలోని బొమ్మపూర్ గ్రామంలో ఎన్.ఎస్.యు.వై. మండల అధ్యక్షుడు రంజిత్ రెడ్డి సోదరుని రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మహాముత్తారం మండల మాజీ కోఆప్షన్ మెంబర్ నజీర్ సోదరుడు సాజిద్ వివాహం మహదేవపూర్ లో జరుగగా ఆ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ ఎనమండ్ర రామన్ రావు, పురోహితుడు మజహార్ యూత్ నాయకులు ఎజాస్, అస్రార్ ఖురేషి, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.