16-04-2025 01:07:58 AM
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 15 (విజయక్రాంతి) సిరులు పండించే కొర్రమీను చేపల పెంపకం ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెంక్లబ్ లో జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులకు, వ్యవసాయ శాఖ ఏపీఎంలకు కొర్రమీను చేపల పెంపకం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం అన్ని సమయాల్లో కలిసి వస్తుందని గ్యారంటీ లేదుని, ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడిన ఇబ్బందే .. తక్కువ పడినా కూడా ఇబ్బందే.. ప్రకృతి సహకరిస్తేనే అధిక దిగుబడిని పొందగలరు. కానీ, అకాల వర్షాల కారణంగా పం ట చేతికి అందకుండా పోతుంది. దీంతోపాటు ఇం ట్లో ఉన్న మహిళలు మగవాళ్లు అందరూ, వ్యవసాయ కూలీలు నిరంతరం కష్టపడాల్సి వస్తుంది.
కాబట్టి ఒక్కసారి పెట్టుబడితో నిరంతరం ఆదాయం వచ్చే చేపల పెంపకం పైన రైతులు దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ఈ చేపల పెంపకంలో కొర్రమీను మాత్రమే ఎందుకు చెప్తున్నామంటే అది ఎటువంటి వాతావరణం అయినా తట్టుకుని బురదలో అయినా బతికే చేప అన్నారు.
కొర్రమీను చేపల పెంప కం కొరకు ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదని ఒక పావుగుంట ప్రదేశంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం ఇంకో పావు కుం ట ప్రదేశంలో ఫామ్ పౌండ్ నిర్మాణం, సు మారు మూడున్నర రూపాయలతో చేపల పెంపకానికి అవసరమైన అన్ని వాటర్ ట్యాంక్, దానా వంటివి తయారు చేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో చేప పిల్ల ఖరీదు రూ15, 1000 చేపల పిల్లల పెంపకం చేప ట్టి అందులో 100 చేప పిల్లలు చనిపోయిన 900 చేప పిల్లలు మీ చేతికి వస్తే కిలో సు మారు రూ 300 అమ్మిన రూ 2.70 లక్ష లు వస్తుందన్నారు.
కేవలం 7 నెలల్లో చేతికి వస్తుందని తెలిపారు. కొర్రమీను చేపల పెంపకం యూనిట్ స్థాపన కొరకు బ్యాం కుల ద్వారా పీఎం ఈ జిపి పథకం ద్వారా 35 శాతం సబ్సిడీ వస్తుందని, చేపల పెంపకానికి కావలసిన ఫామ్ పౌండ్ నిర్మాణం ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా నిర్మించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కొర్రమీను చేపల పెంపకం ద్వారా కేవలం రెండు సంవత్సరాల లోనే పెట్టుబడి వాప సు వస్తుందని లక్షల్లో ఆదాయం చేకూరుతుందని మరి ఇతర పంటల్లోనూ ఇంత ఆదాయం రాదని అందువలన జిల్లాలోని రైతులు,మహిళా సమాఖ్య సభ్యులు అధిక సంఖ్యలో కొర్రమీను చేపల పెంపకం చేపట్టాలని సూచించారు.
కొర్రమీను చేపల పెంపకంలో నాణ్యమైన దానా వాడాలని, రోజుకు ఐదుసార్లు చేపలకి దాన వేయాలని ఆయన సూచించారు. ఈ దాన అనేది ఆటోమెటిక్ గా సరఫరా అయ్యే విధంగా ప్రయోగాలను శాస్త్రవేత్తలతో కలిసి నిర్వహిస్తున్నామని తెలిపారు. చేప పిల్లల్ని వాటర్ ట్యాంకర్ లో నాలుగు నెలలు పెంచిన తర్వాత వాటిని నీటి కుంటలో మట్టి, విశాలమైన ప్రదేశంలో పెంచడం ద్వారా పెద్ద పరిమాణంలో తయారవుతాయన్నారు. వాటర్ ట్యాంక్ ఇళ్లలో నీటిని కూరగాయల సాగుచేయవచ్చని తెలిపారు.
ఈ విధంగా రైతులు సాగు చేస్తే ప్రపంచం లో అతి పెద్ద మహమ్మారి వచ్చిన కూడా రైతులకు ఎటువంటి ఇబ్బం ది పడరు. సాఫ్ట్ వెర్ ఉద్యోగస్థులకు దీటుగా వ్యవసాయంలో లాభాలను పొందవచన్నారు. జిల్లాలోని రైతులు మహిళా సమైక్య సభ్యులు ముందడుగు వేసి కొర్రమీను చేపల పెంపకం చేపట్టి రాష్ట్రానికి చేపల పెంపకంలో మన జిల్లా ఆదర్శంగా నిలవాలన్నారు.
ఈ అవగాహన సదస్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ తిరుపతయ్య, మత్స్య శాఖ ఏడి ఇంతియాజ్ ఖాన్ మరియు ఆక్వా కనెట్స్ సంస్థ ప్రతినిధులు, మహిళా సమైక్య సభ్యులు మరియు ఏపిఎంలు సుమారు 400 మంది పాల్గొన్నారు.