calender_icon.png 2 November, 2024 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒలింపిక్స్‌కు శ్రేయసి సింగ్

22-06-2024 02:39:59 AM

న్యూఢిల్లీ: భారత సీనియర్ ట్రాప్ షూటర్ శ్రేయసి సింగ్ స్వాప్ కోటాలో ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. శ్రేయసితో కలిపి భారత్ నుంచి మొత్తంగా 21 మంది షూటర్లు ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొననున్నారు. ఇందులో రైఫిల్ నుంచి 8 మంది, పిస్టల్ విభాగంలో ఏడుగురు, షాట్‌గన్ నుంచి ఆరుగురు పోటీలో ఉన్నారు. భారత టాప్ షూటర్ మనూ భాకర్ రెండు విభాగాల్లో పారిస్ బెర్త్ అందుకున్న సంగతి తెలిసిందే.

దీంతో ఒలింపిక్ కోటాను స్వాప్ చేసుకునేందుకు అవకాశమివ్వాలంటూ భారత షూటింగ్ సమాఖ్య (ఎన్‌ఆర్‌ఏఐ) ఇటీవలే అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్)కు అర్జీ పెట్టుకుంది. ఎన్‌ఆర్‌ఏఐ అభ్యర్థనను ఐఎస్‌ఎస్‌ఎఫ్ అంగీకరించడంతో శ్రేయసికి లైన్ క్లియర్ అయింది. దీంతో శ్రేయసి సింగ్ ఒలింపిక్స్‌లో మహిళల ట్రాప్ ఈవెంట్‌లో మరో షూటర్ రాజేశ్వరీ కుమారితో కలిసి పోటీ పడనుంది. గత రెండు ఒలింపిక్స్‌లో భారత షూటర్లు రిక్త హస్తాలతోనే వెనుదిరిగారు.

చివరగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో విజయ్‌కుమార్ (రజతం), గగన్ నారంగ్ (కాంస్యం) గెలుచుకున్నారు. అంతకముందు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా స్వర్ణంతో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.