calender_icon.png 13 January, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్

12-01-2025 11:30:36 PM

ఛండీగర్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికయ్యాడు. గతేడాది జరిగిన మెగావేలంలో పంజాబ్ కింగ్స్ శ్రేయస్‌ను రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పంత్ (27 కోట్లు) తర్వాత అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కాగా 2024 ఐపీఎల్ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ సారధిగా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. దేశవాలీ టోర్నీల్లోనూ సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్న శ్రేయస్ ఇటీవలే ముంబై జట్టుకు రెండోసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. ఇక రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ నెగ్గిన ముంబై జట్టులోనూ శ్రేయస్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 23న ప్రారంభం కానున్నట్లు ఆదివారం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. మే 25న ఫైనల్ మ్యాచ్ జరిగే చాన్స్ ఉంది. త్వరలో ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.