calender_icon.png 16 January, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రేయస్, పడిక్కల్ హాఫ్ సెంచరీలు

07-09-2024 01:32:43 AM

దులీప్ ట్రోఫీ

అనంతపురం: దులీప్ ట్రోఫీలో భాగంగా అనంతపురం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా జట్టు పట్టు బిగిస్తోంది. ఇండియా టీమ్‌తో మ్యాచ్‌లో డిభూ 202 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (11 నాటౌట్), హర్షిత్ రాణా క్రీజులో ఉన్నారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (44 బంతుల్లో 54), దేవదత్ పడిక్కల్ (70 బంతుల్లో 55) అర్థసెంచరీలతో ఆకట్టుకున్నారు. రికీ భుయ్ (44) రాణించాడు.  ఇండియా బౌలర్లలో మనవ్ సుతర్ ఐదు వికెట్లతో చెలరేగగా.. విజయ్‌కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు.

అంతకముందు ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 168 పరుగులకు ఆలౌటైంది. ఇంద్రజిత్ (72) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా బౌలర్లలో హర్షిత్ రానా 4 వికెట్లు తీశాడు. ఇక బెంగళూరు వేదికగా ఇండియా ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఏ జట్టు 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్ క్రీజులో ఉన్నారు. ఇక ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. ముషీర్ ఖాన్ 181 పరుగులు చేయగా.. ఆఖర్లో నవదీప్ సైనీ (56) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు.