యాదాద్రిభువనగిరి, ఆగస్టు 25 (విజయక్రాంతి): భువనగిరి పట్టణంలో శ్రావణ మాసం సందర్భంగా వివిధ వార్డుల్లో ఆదివారం గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. పట్టణంలోని 8, 28 వార్డుల్లో పోచమ్మ, ఎల్లమ్మ దేవతలకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్, బర్రె మహేందర్, గ్యాయపాక స్వామి, గాంగారం రమేష్, వెంకటేష్, ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.