calender_icon.png 15 March, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 3లో జిల్లా వాసికి స్టేట్ 39వ ర్యాంక్

15-03-2025 12:00:00 AM

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు శ్రావణ్ ఎంపిక

మంచిర్యాల, మార్చి 14 (విజయక్రాంతి) : గ్రూప్ 3 ఫలితాలలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన లెక్కల శ్రావణ్ కుమార్ రాష్ట్ర స్థాయిలో 39వ ర్యాంకు సాధించారు. లెక్కల లింగయ్య, కళావతి దంపతుల కుమారుడు  శ్రావణ్ కుమార్ శుక్రవారం వెలువడిన గ్రూప్ 3 పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. మూడు రోజుల కిందట వెలువడిన గ్రూప్ - 2 ఫలితాల్లో స్టేట్ లెవల్ 97వ ర్యాంక్ సాధించిన శ్రావణ్ గ్రూప్ - 4లో రాష్ట్రస్థాయిలో 210 ర్యాంక్, జిల్లా స్థాయిలో 11వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలోను  పంచాయతీ కార్యదర్శికి నిర్వహించిన పరీక్షలో జిల్లా మొదటి ర్యాంక్ సాధించి కొద్ది రోజులు ఉద్యోగం చేసి గ్రూప్స్ కోసం రాజీనామా చేసి గ్రూప్ సాధించాడు.