29-03-2025 07:10:35 PM
మణిపూర్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన శ్రవణ్ రావును శనివారం జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ముందు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రధాన సూత్రధారి ఎవరనే కోణంలో శ్రవణ్ రావును సెట్ అధికారులు ఐదు గంటలకు పైగా ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులతో శ్రవణ్ కు ఉన్న పరిచయాలపై, ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారని, ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. శ్రవణ్ కుమార్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు విచారించారు.
గత ఏడాది మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్రవణ్ రావుపై ఫోన్ ట్యాంపింగ్ కేసు నమోదైన తర్వాత ఆయన లండన్‌కు పారిపోయారు. తద్వారా సిట్ దర్యాప్తును తప్పించుకోవడంతో రెడ్ కార్నర్ నోటీసులను అధికారులు జారీ చేశారు. అమెరికాలో నివసిస్తున్న రావుకు మార్చి 26న సిట్ నోటీసులు జారీ చేసి, మార్చి 29న విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నోటీసు కాఫీని హైదరాబాద్‌లోని ఆయన కుటుంబానికి కూడా అందజేసింది. తెలంగాణ హైకోర్టు తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత, రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్చి 24న, సుప్రీంకోర్టు అతనికి అరెస్టు నుండి ఉపశమనం కల్పించింది. సిట్ దర్యాప్తుకు అతను పూర్తిగా సహకరించాలని, విచారణ సమయంలో కీలకమైన సమాచారం లభిస్తుందని పోలీసు అధికారులు ఆశిస్తున్నారు.