ముషీరాబాద్ (విజయక్రాంతి): ముషీరాబాద్ విద్యామండలి నూతన డిప్యూటీ ఈవోగా కే. శ్రావణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఇక్కడ విధులు నిర్వహించిన చిరంజీవి ఇటీవల పదవి విరమణ పొందడంతో ఆయన స్థానంలో శ్రావణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో మండల పరిధిలో ఏడు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా కృషి చేస్తామన్నారు. పాఠశాలల హెచ్ఎంలు ఉపాధ్యాయుల సమిష్టికితో మండల పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామన్నారు.