calender_icon.png 22 December, 2024 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార పట్టిన ఎమ్మెల్యే

22-12-2024 02:55:16 PM

సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ లో శ్రమదానం 

ప్రతి ఆదివారం ప్రభుత్వ విద్యాసంస్థలు శ్రమదానం చేద్దాం 

విద్యార్థుల దృష్టి లక్ష్యం వైపు ఉండాలి 

అవసరమైన పుస్తకాల లిస్ట్ ఇవ్వండి అందుబాటులో ఉంచుతా : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అందరికీ ఆదర్శంగా ఉంటూ అభివృద్ధి లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఆదివారం పార పట్టుకుని పనిచేశారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల ప్రాంగణంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం పరిసర ప్రాంతాల్లో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకుని, వసతి గృహంలోని కిచెన్ గదులను ప్రత్యేకంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా వసతి గృహ పరిసర ప్రాంతాలను పరిశోధనగా ఉంచుకోవాలని సూచిస్తూ పారపట్టి చెత్తాచెదారం తీసివేశారు. పిచ్చి మొక్కలను తీసివేసి కొత్త మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... మన చుట్టూ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం మరింత మెరుగుపడడంతో పాటు మన ఆలోచనలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తాయని తెలియజేశారు. విద్యార్థుల చూపు ఎల్లప్పుడూ లక్ష్యం వైపు ముందుకు సాగాలని ఇలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కాస్త నిర్లక్ష్యం వహించి విద్యాభ్యాసం పక్కన పెడితే విద్యార్థుల జీవితాలు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రానున్న నాలుగు సంవత్సరాలలో విద్యాభ్యాసంకు ఉపాధికి స్వర్ణ యుగం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతోమంది ఉద్యోగులు విద్యార్థులు తమ ఉద్యోగాలను తమ విద్య భేసాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కృషి చేశారని గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం వారు ఆశించిన మేరకు అభివృద్ధి చేయలేకపోయిందని విమర్శించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో వెనక్కి చూడవలసిన అవసరం లేకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.