24-02-2025 12:59:35 AM
మేడ్చల్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): సంత్ నిరంకారి బాబా జన్మదినం సందర్భంగా ఆయన శిష్యులు మేడ్చల్ పెద్ద చెరు వు అలుగు వద్ద శ్రమ దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలుగు వద్ద పేరుకు పోయిన చెత్తను తొలగించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ 6వ డివిజన్ మాజీ కౌన్సిలర్ రామన్న గారి మణికంఠ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంత్ నిరంకారి బాబా పుట్టినరోజు ను పురస్కరించుకొని శ్రమదాన కార్యక్రమాలను నిర్వ హించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిరంకారి బాబా గ్రూప్ ప్రతినిధులు ఓంకార, పవన్, మనీష్ పుష్పత్ శంకర్, శర్మ తదితరులు పాల్గొన్నారు.