calender_icon.png 21 April, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్లిక్ గార్డెన్‌లో శ్రమదానం

21-04-2025 01:00:45 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి):  ఈ సందర్భంగా ఏఐసిసి సెక్రటరీ, తెలంగాణ ఇంచార్జి  విశ్వనాథన్ పెరుమాళ్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ల తో కలిసి, హరిత కాకతీయ హోటల్ నుండి పబ్లిక్ గార్డెన్ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో  వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం పబ్లిక్ గార్డెన్ లో శ్రమదాన కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి చెత్తను ఊడ్చారు.ఆదివాసీ కాంగ్రెస్ బునియాడి కార్యకర్త సమ్మేళనం సందర్భంగా హరిత హోటల్ నుండి హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత పబ్లిక్ గార్డెన్ లో సెటిల్ ఆడుతూ సేదు తీరారు.

ప్రతి ఒక్కరు శ్రమదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, ట్రైకార్ చైర్మన్ తేజవత్ బెల్లయ్య నాయక్, పిసిసి డెలిగేట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా వివిధ మండలాల  ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.