calender_icon.png 24 December, 2024 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుష్ప సినిమా చూపించిండ్రు!

02-11-2024 02:39:20 AM

  1. 290 కేజీల గంజాయి స్వాధీనం
  2. దాని విలువ సుమారు రూ.72.50లక్షలు
  3. రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు ట్యాంకర్‌లో స్మగ్లింగ్

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ ౧ (విజయక్రాంతి): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల పోలీసులకు గంజాయి స్మగ్లర్లు మరోసారి పుష్ప సినిమాను చూపించారు. ఏపీలోని రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు ట్యాంకర్‌లో గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు వేసిన ప్లాన్‌ను పోలీసులు చేధించారు.

మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద చేపట్టిన తనిఖీల్లో ట్యాంకర్‌ను పరిశీలించారు. డ్రైవర్ ప్రవర్తను చూసి వాహనాన్ని క్షణ్ణంగా పరిశీలించిన పోలీసులు ట్యాంకర్ మధ్యలో డెస్క్‌ను ఏర్పాటు చేసి భారీ ఎత్తున గంజాయి ప్యాకెట్లు అమర్చినట్టు గుర్తించారు. అనంతరం ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని డ్రైవర్ బల్విర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

అనంతరం విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు. దీంతో ఎస్పీ డీవి శ్రీనివాస్ రావు ఘటనా స్థలానికి చేరుకుని పట్టుబడ్డ గంజాయిని పరిశీలించారు. అనంతరం డీఎస్పీ కురుణాకర్‌తో కలసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు ట్యాంకర్ ద్వారా 145 ప్యాకెట్లలో 290 కేజీల గంజాయిని చేయడానికి ప్రతయత్నించినట్లు పేర్కొన్నారు.

దీని విలువ రూ.72.50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ప్రధాన నిందితుడు అరబింద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్‌కు పంపించినట్లు తెలిపారు. అసాంఘిక కార్కక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పెద్ద మొత్తంలో గంజాయి స్మగ్లింగ్‌ను పట్టుకున్న పోలీసులను అభినందించారు.