calender_icon.png 20 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బత్తుల సిద్దేశ్వర పటేల్ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలపాలి

19-04-2025 09:05:10 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, తెలంగాణ బీసీబిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తుల సిద్దేశ్వర్ పటేల్ కు మద్దతు తెలపాలని తెలంగాణ ఉద్యమ సామాజిక నాయకుడు గడ్డం మోహన్ రెడ్డి అన్నారు. శనివారం దౌల్తాబాద్ మండల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఎనిమిది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా జరిగే జనగణనలో కులగణన చేర్చి లెక్కించాలని, దేశవ్యాప్త కులగణన జరగాలని ఢిల్లీలో పోరాటాలు జరుగుతున్నాయని కానీ ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చితే సుప్రీంకోర్టు తీర్పులకు అతీతంగా అమలు జరుగుతుందన్నారు. బిసి రిజర్వేషన్ పెంపుకు అడ్డంకిగా ఉన్న 50% సీలింగ్ను అధిగమించగలుగుతామని తద్వారా బీసీ సమాజం సరైన భాగస్వామ్యాన్ని పొందడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా జరిగే జాతీయ కులగణన చేర్చాలని కేంద్ర ప్రభుత్వ ను ఒప్పించడానికి గాందేయమార్గంలో ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు నిలుద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు కుమ్మరి నర్సింలు, స్వామి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు...