ఓటీటీలో నయనతార లైఫ్ స్టోరీకి సంబంధించిన డాక్యుమెంటరీ విడుదల కానుంది. గౌతమ్ మీనన్ ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. కొద్ది రోజుల క్రితం దీనికి సంబంధించిన పోస్టర్ వదిలిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. దీనిలో భాగంగా తన కెరీర్, ప్రేమ, పెళ్లి తదితర విషయాల గురించి నయన్ వివరించారు. ‘నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్’ పేరిట డాక్యుమెంటరీ తీశారు.
ఇక ట్రైలర్లో ఆమె మూవీస్‌లో నటించడం, అవార్డులు అందుకోవడం, అలాగే నయనతార గురించి రానా, రాధిక, నాగార్జున, అట్లీ, నెల్సన్, ఉపేంద్ర వంటి వారు మాట్లాడటం చూపించారు. అలాగే నయనతారపై వచ్చిన కథనాలను చూసి ఆమె తల్లి ఆవేదన చెందడం, విఘ్నేశ్‌తో ప్రేమ, పెళ్లి వంటి అంశాలను సైతం ట్రైలర్లో చూపించారు. అందరినీ సంతోష పెట్టేందుకే ఈ డాక్యుమెంటరీకి ఒప్పుకున్నట్టు నయనతార వెల్లడించారు. మరి ఈ డాక్యుమెంటరీలో ఆమె పూర్తి జీవితాన్ని చూపిస్తారా? లేదంటే కొన్ని అంశాలను దాచేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.