09-04-2025 12:39:06 AM
నాగర్ కర్నూల్ ఏప్రిల్ 8 (విజయక్రాంతి) రాత్రి సమయంలో స్టడీ అవర్స్కు ఆలస్యంగా వచ్చిందని ఓ విద్యార్థిని ఇంగ్లేష్ టీచర్ తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన విషయంలో మనస్తపం చెంది ఆత్మహత్య యత్న నికి పాల్పడిన విషయంలో కేజీబీవీ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మంగళవారం నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో యామిని అనే 9వ తరగతి విద్యార్థిని ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి ఇతర ఉపాధ్యాయులతో విచారణ జరిపారు. కనీసంవాటర్ తాగనీయ కుండా, బాత్రూం కూడా వెళ్ళనీయకుండా పనిష్మెంట్ ఇవ్వడంతోనేమనస్థాపానికి గురై చేయి కోసుకున్నదని పేర్కొన్నారు.
ఘటనపై కేజీబీవి సెక్టోరియల్ అధికారిని శోభా రాణితో కలిసి డీఈఓ రమేష్ కుమార్ నివేదికను జిల్లా కలెక్టర్కు అందించినట్లు తెలిపా రు. సంఘటనకు కారకురాలైన ఇంగ్లేష్ టీచర్ కళ్యాణికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ ఘటనపై ఆయా విద్యార్థి సం ఘాల నేతలు కస్తూర్బా పాఠశాల ముందు నిరసన చేపట్టారు.