calender_icon.png 26 March, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కులు అడిగితే అరెస్ట్ చేయడమా?

26-03-2025 12:23:12 AM

బడ్జెట్ సమావేశంలో ఫిక్స్‌డ్ వేతనం రూ.18వేలు నిర్ణయించాలి 

రాష్ట్ర ప్రభుత్వం ఆశకు ఇచ్చిన  మాట నిలబెట్టుకోవాలి 

సిఐటియూ డివిజన్ కార్యదర్శి డీ.విద్యాసాగర్ 

అందోల్  మార్చి 25 :ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన చేస్తే అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం చాలా దుర్మార్గమని సిఐటియు డివిజన్ కార్యదర్శి డి విద్యాసాగర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్టులకు నిరసనగా జోగి పేట పట్టణ కేంద్రంలో మంగళవారం నాడు ఆశాలతో కలిసి రాస్తారోకో, మానవహారం  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అనేక దఫ్ఫాలుగా శాంతి తంగా నిరసన తెలియజేస్తే సమస్య పరిష్కరించాల్సింది పోయి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ ను తరలించడం  చాలా దుర్మార్గం అని తక్షణమే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు పిక్స్ పెడుతున్నాం 18 వేల రూపాయలు చెల్లించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఆశాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆశల పట్ల మొండి వైఖరి విడనాడాలి అని కనీస వేతనం ఈఎస్‌ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ఆశాలకు ఎస్‌ఐపిఎఫ్ కల్పించడం సిగ్గుచేటు అని అన్నారు తక్షణమే ఆశలను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనం పెంచాలని ఆశలకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని సమస్యల పరిష్కరించకుంటే పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు లక్ష్మి మానెమ్మ నిర్మల సుజాత అంజమ్మ నాగమణి అడివి అమ్మ కవిత మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.