బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమ
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో అన్నదాతలను దగా చేసి, రైతు పండుగ పేరి ట మూడు రోజుల పాటు విజయోత్సవాలు జరుపుతుండటంపై బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి రాణీరుద్రమ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ రాష్ర్ట కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.
వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయని సర్కారుకు విజయోత్సవాలు నిర్వహించుకునే అర్హత లేదన్నారు. రైతు విజయోత్సవాలకు బదులు.. రైతు మోసాల ఉత్సవాలు జరుపుకోవాల ని ఎద్దేవా చేశారు. రైతులకు ఏం ఒరగబెట్టారని సంబురాలు చేసుకుంటు న్నారో సమాధానం చెప్పాలన్నారు.