calender_icon.png 3 April, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా?

03-04-2025 01:17:19 AM

  1. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు 
  2. నాలుగేళ్లు చర్యలు తీసుకోకపోయినా అంతేనా?
  3. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా?
  4. విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా? 
  5. ప్రశ్నించిన ధర్మాసనం
  6. విచారణ నేటికి వాయిదా 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నాలుగేళ్లు చర్యలు తీసుకోకపోయినా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం మరోసారి విచారణ ప్రారంభమైంది.

ఈ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టీన్ జార్జ్ మసీహ్ ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా స్పీకర్ తగిన చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గత వారం వాదనలు ముగిశాయి. ఈ కేసులో బీఆర్‌ఎస్ తరఫున ఆర్యమా సుందరం వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ స్పీకర్ తరఫున తాజా గా ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. “స్పీకర్‌కు రాజ్యాంగం కల్పించిన విశే షాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే జ్యూడీషి యల్ సమీక్షకు అవకాశముంటుంది. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? వద్దా? అనేది స్పీక ర్ నిర్ణయమే.

ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు”అని వాదించారు. జస్టిస్ బీఆర్ గవాయ్ స్పంది స్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? ఆయనకు విజ్ఞ ప్తి చేయడమో..ఆదేశించడమే చేయలేమా? అని ప్రశ్నించారు. అనంతరం రోహత్గీ  స్పం దిస్తూ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే పిటిషన్ వేశారని, ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేశారని..

కనీసం ఆలోచిం చే అవకాశం లేకుండా పిటిషన్లు వేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రోహత్గీ వాదనల్లో జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ.. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని, నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకో కపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని ప్రశ్నించారు.

ఫిరాయింపుపై పిటిషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని రో హత్గీ చెప్పారు. 2024 మార్చి 18న పిటిషన ర్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని, 2025 జనవరి 16న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నో టీసులు జారీచేశారన్నారు. స్పీకర్ తన విధు లు నిర్వర్తిస్తున్నారని కోర్టుకు తెలిపారు.

స్పీకర్ నిర్ణయానికి, సీఎం వ్యాఖ్యలకు సంబంధం లేదు..

“ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారినా ఉప ఎన్నికలు రావు”అంటూ అసెంబ్లీలో సీ ఎం రేవంత్ చేసిన ప్రకటనను ఫిరాయింపు ల పిటిషన్‌లో భాగంగా..పిటిషనర్ల తరఫు న్యాయవాది సుందరం ధర్మసనానికి చదివి వినిపించారు. దీనికి ముకుల్ రోహత్గీ స్పం దిస్తూ స్పీకర్ నిర్ణయానికి, సీఎం వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.