నిర్మల్ (విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి హ్యట్రిక్ సాధించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఈసారి కూడా ఫలితాలు అలాగే వచ్చేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు.