calender_icon.png 28 March, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింత బాధ్యతగా విధులు నిర్వహించాలి

25-03-2025 04:32:46 PM

ఎస్పీ డివి శ్రీనివాసరావు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పదోన్నతి విధుల పట్ల మరింత బాధ్యత పెంచుతుందని ఎస్పీడివి శ్రీనివాసరావు అన్నారు. హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మెంగారావు ఏఎస్ఐ గా పదోన్నతి పొందడంతో మంగళవారం ఎస్పీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన మెంగారావును అభినందించిన ఎస్పీ మాట్లాడుతూ... ఉద్యోగరీత్యా ఒత్తిడి ఉన్నప్పటికీ విధుల పట్ల నిబద్దతతో పనిచేసినప్పుడు గుర్తింపు లభిస్తుందని తెలిపారు.  2018 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు. ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన మెంగారావు ను పలువురు అభినందించారు.