calender_icon.png 10 January, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛలో హైదరాబాద్ కు తరలిరావాలి

13-12-2024 04:22:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి సురేష్ తెలిపారు. శుక్రవారం సిఐటి కార్యాలయంలో ఛలో హైదరాబాద్ కరపత్రాలను విడుదల చేశారు. అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని పదోన్నతులు కల్పించాలని అంగన్వాడీ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని తదితర డిమాండ్లతో ఈ ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లలిత, శైలజ, గంగామణి, విజయ పాల్గొన్నారు.