ఏపీ సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ, నవంబర్ 16: సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఢిల్లీలోని హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన సోషల్ మీడియాలో వైసీపీ నేతల పోస్టులపై అసహనం వ్యక్తం చేశారు. తమతోపాటు వైసీపీ అధినేత జగన్ తల్లి, చెల్లిపై కూడా ఆ పార్టీకి చెందిన నాయకులే అసభ్యకరపోస్టులు పెడుతున్నారన్నారు.
అ లాంటి వారిపై చర్యలు తీసుకోకుడ దు అంటే ఎలా అని ప్రశ్నించారు. అనంతరం తన అరెస్టును గురించి మాట్లాడుతూ అక్రమ కేసుల్లో తనను అదుపులోకి తీసుకుని 53 రోజులపాటు వేధించినట్టు చెప్పారు. అయినా తాను నిరాశ చెందలేదన్నా రు. జైలు జీవితం తనలో మరింత పట్టుదల పెంచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలిపే లక్ష్యంతో పని చేస్తుందని చెప్పారు.
ఇటీవల ప్రపంచ దేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకునే ఎక్కువ మంది పిల్లలు కనాలని ప్రజలకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇద్దరి కంటే ఎక్కువ మం ది పిల్లలుంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా నిబంధన లు తీసుకురాబోతున్నట్టు స్పష్టం చేశారు.