calender_icon.png 28 October, 2024 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోహిత్‌ను చూసి నేర్చుకోవాలి: అఫ్రిది

02-07-2024 12:05:00 AM

కరాచీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయని మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యానించాడు. కెప్టెన్ ఎలా ఉండాలో రోహిత్‌ను చూసి నేర్చుకోవాలని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు చురకలంటించాడు. ‘ఒక కెప్టెన్‌గా జట్టును ఎలా నడపాలో రోహిత్‌ను చూసి నేర్చుకోవాలి. కెప్టెన్ బాడీ లాంగ్వేజ్ విజయానికి మొదటి మెట్టు. నాయకుడు జట్టుకు స్పూర్తిగా నిలవాలి.

టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఇది తర్వాత బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. కెప్టెన్సీతో పాటు దూకుడైన మనస్తత్వం, అటాకింగ్ క్రికెట్ అతడిని ప్రత్యేక సారథిగా నిలిపాయి. నా దృష్టిలో కెప్టెన్సీ రోల్ చాలా ప్రాముఖ్యత కలిగిందని నమ్ముతా. పాక్ జట్టులో మార్పులు ఉండే అవకాశముంది’ అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.