calender_icon.png 15 January, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతలు పానీపూరి అమ్ముకోవాలా?

19-07-2024 12:05:00 AM

శంకరాచార్య స్వామిపై ఎంపీ కంగనా ఫైర్

ముంబై, జూలై 18: ‘నేతలు రాజకీయాలు చేయకుండా పానీపూరి అమ్ముకోవాలా?’ అంటూ ఎంపీ కంగనా రనౌత్ గురువారం జ్యోతిర్మఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానందపై చేసిన వ్యాఖ్యలు రాజకీయప రంగా దుమారం రేపుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బుధవారం ముంబైలో స్వామి మర్యాదపూ ర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉద్ధవ్‌కు కొందరు ద్రోహం చేశారు. అందుకు ప్రజలు వేదనకు గురవుతున్నారు. ఆ ఫలితం ఇటీవల ఎన్నికల్లో ప్రతిబింబించింది. తీరదు’ అని వ్యాఖ్యానించగా కంగనా పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.