10-07-2024 03:33:39 AM
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): గ్రూప్ పరీక్ష వాయిదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గ్రూప్ వాయిదా వేయాలని రోజురోజుకు అభ్యర్థులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. మరోవైపు విపక్ష పార్టీలు సైతం గ్రూప్ వాయిదా వేయాలని నిరుద్యోగులకు మద్దతుగా గొంతు కలపడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో గ్రూప్ వాయిదా విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. గ్రూప్ వాయిదా వేసే అంశంపై సర్కారు పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం.
డీఎస్సీ, గ్రూప్ రెండు పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీని మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్లను సైతం జారీ చేయనుంది. ఈక్రమంలో ఈ రెండు పరీక్షల్లో ఇప్పటి వరకైతే డీఎస్సీ మాత్రం వాయిదా పడే పరిస్థితి కనబడటంలేదు. ఇక డీఎస్సీకి గ్రూప్ పరీక్షలకు మధ్య ఒకే రోజు గ్యాప్ ఉండడంతో గ్రూప్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ ఐదు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నవారు
నెల రోజులు వాయిదా పడే అవకాశం?
గ్రూప్ పరీక్షను ఒక వేళ వాయిదా వేయాలని భావిస్తే కనీసం 15 రోజుల నుంచి నెల రోజులు వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అక్టోబర్‌లో గ్రూప్ మెయిన్స్ పరీక్షలు ఉండగా, గ్రూప్ పరీక్ష నవంబర్‌లో ఉంది. వాయి దా వేయాలనుకుంటే గ్రూప్ సెప్టెంబర్‌లో నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మాత్రం డిసెంబర్‌లో నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈక్రమంలోనే గ్రూప్ పరీక్షల నిర్వహణ, వాయిదా అంశాలపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది.
టీజీపీఎస్సీ చైర్మన్‌తో కోదండరామ్ భేటీ...
డీఎస్సీ, గ్రూప్ వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనలపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ స్పందించారు. ఈమేరకు నిరుద్యోగుల సమస్యలను టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలకు కొంత వ్యవధి ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ... అభ్యర్థుల సమస్యలపై ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి తాను... కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసినట్లు వివరించారు. గ్రూప్ పోస్టులను పెంచే అంశాన్ని కూడా పరిశీలించాలని చైర్మన్‌కి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.