నిర్మల్ (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధించేలా ఇప్పటినుండి విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు అన్నారు. గురువారం నరసాపూర్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళలో స్టడీ అవర్స్ లను నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం హాజరు పట్టిక మధ్యాహ్న భోజన పథకం తదితర వివరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.