భద్రకాళి టెక్స్ టైల్స్ ప్రారంభం..
మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు..
కోదాడ (విజయక్రాంతి): వస్త్ర వ్యాపారంలో రాణించాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై శాంసంగ్ ప్లాజా పక్కన ఏర్పాటు చేసిన భద్రకాళి టెక్స్ టైల్స్ ను ప్రారంభించి మాట్లాడారు. ప్రోప్రైటర్లు రామడుగు శ్రీనివాసరావు, రామినేని భాస్కరరావు మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలతో సరసమైన ధరలకే బ్రాండెడ్ వస్త్రాలను అమ్ముతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, టిపిసిసి డెలిగేట్స్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, వెంపటి మధు తదితరులు పాల్గొన్నారు.