calender_icon.png 25 December, 2024 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలి

25-12-2024 12:00:00 AM

సీఎం రేవంత్‌రెడ్డికి బీజేఎల్పీ నేత ఏలేటి బహిరంగ లేఖ

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఎలాగైనా గద్దె నెక్కాలని అనేక హామీలిచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అప్పటివరకు ఉద్యోగ భద్రతతో కూడిన పేస్కేల్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీని ఇవ్వాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రీఎంగేజ్ విధానాన్ని తొలగించాలని సూచించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే వారితో కలిసి ఆందోళనల్లో పాల్గొంటామని హెచ్చరించారు.