calender_icon.png 16 April, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిగా గుర్తించాలి

15-04-2025 11:07:27 PM

పట్టా పాస్ బుక్కులు ఇచ్చి భూభారతి రికార్డులో పొందుపరచాలి..

కొల్చారం (విజయక్రాంతి): కొల్చారం ఎమ్మార్వో కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే మల్లేశం మాట్లాడుతూ.. కొల్చారం మండలం కొంగోడు గ్రామ శివారులోని సర్వే నెంబర్ 209 లోగల భూమిలో కాస్ట్ లో ఉన్న రైతులకు భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించి పట్టా పాస్ బుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 70 సంవత్సరాల నుండి కాస్తులు లో ఉన్నామని అన్నారు. 2012 జూన్ 23న రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు సర్వే చేసి రెవెన్యూ భూమిగా గుర్తించారు. అప్పటినుండి ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు రెవెన్యూ భూమిగా గుర్తించి పట్టా పాస్ బుక్కులు ఇవ్వడంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తం భూమి 93 ఎకరాలు సర్వేలో తేలింది అని అన్నాడు. 2012 సంవత్సరంలో సర్వే చేసి ఇప్పటివరకు అధికారులు పాస్ బుక్కులు ఇవ్వకుండా కావాలనే ఆపినట్టు తెలుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2018లో నరసాపూర్ ఆర్డీవో రెవెన్యూ భూమిగా సర్టిఫికెట్ ఇష్యూ చేశారని అన్నారు. మళ్ళీ స్థానిక ఎమ్మార్వో గారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పడం దుర్మార్గంగా ఉందని అన్నారు. ఫారెస్టు రెవెన్యూకు సర్వే జరిగిందని రికార్డ్ తో చూపించిన అధికారులకు అర్థం కావడం లేదని అన్నారు. ఇది కావాలని రెవెన్యూ అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మళ్లీ సర్వే చేసి కొంగోడు గ్రామ రైతులకు రెవెన్యూ భూమిగా గుర్తించి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు భరోసా రైతు బీమా పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామానించ దాసు, మాదిగ దుర్గయ్య, మాదిగ సామాన్య, దామరంచ లక్ష్మి సత్తెమ్మ సరే యాదగిరి యేసయ్య మల్లేశం కేకులు వినోద తదితరులు పాల్గొన్నారు.