21-03-2025 01:55:23 AM
సూర్యాపేట,మార్చి20(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేంద్నారికి సమీపంలోని కేసారంలో గల రెండుపడక గదుల గృహాలను ఏప్రిల్ రెండో వారం కల్లా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. గురువారం సూర్యాపేట కేసారం2 వద్ద గల డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. జరుగుతున్న పనులపై పలు సూచనలు చేశారు.
480 ఇండ్ల పనులను 20 రోజులలో ొపూర్తి చేసి ఏప్రిల్ రెండో వారంలో గృహప్రవేశాలు జరిగేలా అన్ని సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్, తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్ అండ్ బి డి ఈ పవన్ కుమార్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.