13-02-2025 01:07:00 AM
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): ప్రజలందరినీ సామాజిక భద్రతా పథకాలలో చేర్చాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ బ్యాంకులను కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వ హించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 14, 15 తేదీల్లో శిల్పారామంలో జరిగే మన మహబూబ్‌న గర్ మహానగరోత్సవంలో పాల్గొని విజయ వంతం చేయాలని బ్యాంకర్లను కోరారు.
రైతులకు మహిళలకు, వీధి వ్యాపా రులకు, చిన్న వ్యాపారులకు విరివిగా రుణాలు ఇ వ్వాలని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సర మహబూబ్‌నగర్ జిల్లా ప్రాధాన్యతా రంగా నికి నాబార్డ్ ఋణ అంచనాలు పోటెన్షి యల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (PLP)ను బుధవా రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి.సి. సి,డి.ఎల్.అర్.సి సమావేశంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ విడుద ల చేశారు.
ప్రతి సంవత్సరం నాబార్డ్ తయా రు చేస్తుందని పేర్కొన్నారు. అందరూ ఆర్థి కంగా బలోపేతరమే లక్ష్యంగా బ్యాంకుల పని చేయాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు, ఆర్‌బిఐ ఎజిఎం తన్య సంగ్మా, డిడిఎం ష ణ్ముక శర్మ, ఎల్‌డిఎం కాల్వ భాస్కర్, తెలం గాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ సత్య నారాయణ, యు.బి. ఐ డిప్యూటీ రీజినల్ మేనేజర్ మురళీ కృష్ణ, ఎస్.బి. ఐ చీఫ్ మేనేజర్ శ్రీమతి నర్మద, డి.అర్.డి. ఓ నర్సింహులు,పరిశ్రమల శాఖ జి.ఎం.ప్రతాప్, పశు సంవర్థక శాఖ జె.డి.మధు సూధన్ గౌడ్, బ్యాంకు కంట్రోలర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.