calender_icon.png 25 February, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు సాగునీరు ఇవ్వాలి

25-02-2025 12:16:58 AM

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

 చేర్యాల ఫిబ్రవరి 24:  ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో తపస్పల్లి రిజర్వాయర్ నింపి చేర్యాల ప్రాంత రైతులకు తాగునీరు అందివ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి చివరి వారంలోనే నీటి ఎద్దడి తలెత్తిందన్నారు. బోరు బావులలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి అన్నారు. పంటను కాపాడుకోవడానికి రైతులు బోర్ బావులు తవ్వించడానికి సిద్ధపడుతున్నారన్నారు.

రైతులు ఇంతటి  ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం నిమ్మకి నీరత్తినట్లు  వ్య వరిస్తుందన్నారు. దేవాదుల ప్రాజెక్టులో ఆపరేషన్, నిర్వహణ డిపార్ట్మెంట్ వారు తమకు వచ్చే బకాయిల కోసం 15  రోజుల నుండి స్ట్రైక్ చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే సమస్య తలెత్తింది అన్నారు. వారి సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడానని, సమస్య పరిష్కారమైందని మూడు  రోజుల నుండి నీటి విడుదల జరుగుతుందన్నారు.

దేవాదుల రెండో పేజ్ కు సంబంధించి ధర్మసాగర్ గండి రామారం రెండో మోటరు ఆన్ చేస్తేనే ఇక్కడి రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హాయంలో ఏనాడు పంటలు ఎండ లేదని 365 రోజులు చెరువులు జలకలతో కళకళలాడాయి అన్నారు. వెంటనే సాగునీరు అందివ్వాలని లేనిపక్షంలో రైతులు అందర్నీ కూడగట్టి  పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ నాయకులు ముత్యాల బాల నర్సయ్య, అంకుగారి శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.