calender_icon.png 19 April, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి

09-04-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

జగిత్యాల, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ’ప్రజావాణి’లో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను కలెక్టర్, అదనపు కలెక్టర్ బిఎస్.లత స్వయంగా స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటూ వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వస్తారన్నారు. వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై అధికారులు సానుకూలంగా వ్యవహరించడంతో పాటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. అర్జీలను  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులు సమర్పించిన ప్రజలకు విశ్వాసం తగ్గకుండా, అర్జీలపై స్పందించి సానుకూల చర్యలు వెంటనే తీసుకోవాలన్నారు.

వారి సమస్యలకు పరిష్కారం చూపకపోతే అధికార యంత్రాంగంపై విశ్వాసం తగ్గే అవకాశాలున్నాయని, అర్జీదారులు మళ్ళీ ఫిర్యాదులతో వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రజావాణిలో తమ సమస్యలు విన్నవించుకున్న వారికి సత్వరమే పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 40 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులు పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్.లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీఓలు మధుసూధన్, జివాకర్’రెడ్డి, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ హకీమ్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సిబ్బంది పాల్గొన్నారు.