calender_icon.png 2 January, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

30-12-2024 09:01:49 PM

మణుగూరు: సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని బూర్గంపాడు అదనపు ఎస్ఐ నాగ భిక్షం అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సారపాక కూడలిలో వాహనదారులకు, స్థానికులకు సైబర్‌ క్రైమ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై నాగభిక్షం మాట్లాడుతూ.. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్‌లలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, కేవైసీలను అప్‌డేట్‌ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూడదన్నారు. సైబర్‌ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పాపయ్య, మంగిలాల్ తదితరులు ఉన్నారు.