రాష్ట్రంలో పది రూపాయల నోట్ల కొరత ఎక్కువగా కనిపిస్తున్నది. బస్సులలో ప్రయాణికుల వద్ద కూడా ఈ నోట్లు లభ్యం కావడం లేదు. దీంతో అటు కండక్లర్లు కూడా చిల్లర విషయంలో ఇబ్బంది పడవలసి వస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ పది రూపాయల నాణేలను చలామణిలోకి తెచ్చినప్పటికీ అనేకమంది దుకాణాదారులు వాటిని తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.
ఈ నాణేలను ఖచ్చితంగా తీసుకోవాలని, లేకపోతే జరిమానా విధిస్తామని ఉన్నతాధికారులు కఠినమైన ఆదేశాలు ఇచ్చి, అవి అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. అలాగే, రిజర్వ్ బ్యాంక్ కూడా పది రూపాయల నోట్ల కొరతను తీర్చడానికి మరిన్ని కొత్త నోట్లను ముద్రించాలి.
షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్