10-03-2025 01:16:04 AM
-నిర్మాణాలకు ఇసుక కొరత.. అక్రమ ఇసుకనే అసరా?
-దిక్కు తోచని స్థితిలో ఫిల్టర్ ఇసుక వ్యాపారులను సంప్రదిస్తున్న నిర్మాణదారులు
-చూసి చూడనట్టు వ్యవరిస్తున్న సంబంధిత అధికారులు
-తనిఖీలు చేపడతాం : జయలక్ష్మి, తాసిల్దార్, భూత్పూర్ మండలం
భూత్పూర్, మార్చి 9 : నిబంధనలు ఎన్ని ఉన్నా ఆచరణలో మాత్రము ఆమడ దూరం లో ఉన్నాయి. వేసవి కాలం కావడంతో ఇం డ్ల నిర్మాణం ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో ఫిల్టర్ ఇసుక వ్యాపారస్తులు మరింత ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎలాగైనా ఈ సీజన్ లో అత్యధికంగా ఫిల్టర్ ఇసుక విక్రయించాలని సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. నియంత్రించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఏండ్ల తరబడి ఈ వ్యవహారం నడుస్తున్న నామమాత్రంగా తనిఖీలు చేపడుతూ పరోక్షంగా ఇసుక అక్రమ రవాణాకు కొందరి అధికారుల సపోర్టు ఉందనే ఆరోపణలు సైతం లేకపోలేదు. దీంతో భూ త్పూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఫిల్టర్ హౌస్ లను ఏర్పాటు చేసుకొని మట్టి తవ్వకాలను చేపట్టి కడిగి ట్రాక్టర్ ల ద్వారా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలిస్తుండ్రు. అధికారులకు తెలిసిన తెలియనట్టు వ్యవరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
అన్ని విషయాలు తెలుసంటున్న ప్రజలు
ఒక చిన్న తప్పు చేస్తే అతనిపై కేసు పెడితే నిందితులు ఎక్కడున్నా పట్టుకునే యంత్రాం గం అందుబాటులో ఉన్నప్పటికీ దర్జాగా ఫిల్టర్ ఇసుక దందా చేస్తున్న ఎందుకు పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు ? ఫిల్టర్ ఇసుక తయారు చేయడం ద్వారా కూడా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, నియంత్రించవలసిన అధికారులు పట్టించుకోకపోతేఎవరు పట్టించుకుంటారని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఇసుకపాలసి తీసుకువచ్చి ఇసుక అత్యధికంగా లభించే ప్రాంతాల నుంచి తరలించి నిర్మాణదారులకు అందించవలసిన అవసరం ఎంతై నా ఉందని ఇటు నిర్మాణదారుల నుంచి డిమాండ్ ఉంది. వివిధ గ్రామాల ప్రజల నుంచి కూడా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు చెప్పడం ద్వారా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందుకే నిర్లక్ష్యం
నిర్మాణంలో చాలా వ్యత్యాసాలు ఉన్నా యి. ఎన్ని సమస్యలు కొలిక్కి వచ్చినప్పటికీ ఇసుక రవాణా మాత్రం ఒక్క కొలిక్కి రావ డం లేదు. తాత్కాలికంగా అధికార యంత్రాం గం చర్యలు తీసుకుంటున్నప్పటికీ నా చారంలో మాత్రం ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటే ఆ వ్యక్తి ఎలాగో అలా గా ఇసుకను తన పలుకుబడిని, ఇతర మార్గా ల ద్వారా ఇసుకను తెప్పించుకొని ని ర్మాణం పూర్తి చేసుకుంటున్నారు. కాగా ఇదే విధానా న్ని నూతనంగా ఇతరులు నిర్మాణం చేపడితే ఈ మార్గాలను వారికి చెబుతున్నారు. ఈ విధానమే అంచలంచెలుగా అక్ర మ ఇసుక రవాణాకు దారితీస్తుంది. ఇదే అ దునుగా భావిస్తున్న ఇసుక వ్యాపారులు ఫిల్టర్ ద్వారా ఇసుకను తయారుచేసి నిర్మాణదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటుండ్రు. నియంత్రించాల్సిన అధికారులు అటువైపు చూడడమే మానేసినట్టు కనిపిస్తుంది.
చర్యలు తీసుకుంటాం..
ఫిల్టర్ ద్వారా ఇసుకను ఎవ్వరు తయారు చేయకూడదు. మండల పరిధిలో అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తనిఖీలు చేపట్టి అక్రమంగా ఇసుక రవాణా చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ఈ విషయంలో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- -జయలక్ష్మి, తాసిల్దార్, భూత్పూర్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా