రాష్ట్రంలో ఇంకా అగ్నిమాపక కేంద్రాల కొరత తీవ్రంగా ఉంది. ఎక్కడైనా అనుకోకుండా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే ఎక్కువ ఆలస్యం జరక్కుండా నివారించే పరిస్థితులు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాలలో చాలినన్ని అగ్నిమాపక కేంద్రాలు లేకపోవడమే. ప్రస్తుతం ఈ కేంద్రాలు రెవెన్యూ డివిజన్ కేంద్రాలలోనే ఉన్నాయి. కిలోమీటర్ల దూరం పాటు ప్రయాణించి వాహనాలు వచ్చేసరికి జరగవలసిన ఆస్తి నష్టం జరుగుతోంది. కనీసం పాత మండల కేంద్రాలలోనైనా అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మళ్లీ వేసవి వచ్చే లోగానైనా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్