calender_icon.png 20 March, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్దియాలో ఇంజినీర్ల కొరత!

17-12-2024 12:00:00 AM

  1. ముగ్గురు ఎస్‌ఈలకూ అదనపు బాధ్యతలు 
  2. నెలాఖరులో రిటైర్ కానున్న సీఈ దేవానంద్
  3. ఈ ఏడాదిలో 20 మంది అధికారులు రిటైర్మెంట్  
  4. హెచ్‌సీటీలో భాగంగా గ్రేటర్‌లో రూ.7వేల కోట్లతో 38 కొత్త ప్రాజెక్టులు
  5. 200 మంది కావాలని కోరితే 112 మంది కొత్త ఏఈలు కేటాయింపు 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): బల్దియాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, రోడ్లను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్‌సీటీ)పేరుతో ప్రత్యేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.

ఇందులో భాగంగా రూ.7,032 కోట్లతో ఏడు దశల్లో 38 ప్రాజెక్టులు చేపట్టనుంది. బల్దియాలో ఈ ఏడాది మొత్తం నలుగురు ఎస్‌ఈలతో పాటు మొత్తం 20 మంది ఇంజినీరింగ్ అధికారులు రిటైర్ కానున్నారు. ఈ నెలాఖరులో సీఈ (ప్రాజెక్టులు) కూడా దేవానంద్ రిటైర్మెంట్ అవుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎస్‌ఈలకు అదనపు బాధ్యతలు ఉన్నాయి.

దీంతో ఎస్‌ఈలు, సీఈల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న హెచ్‌సీటీ ప్రాజెక్టుల నిర్వహణ, పర్యవేక్షణ ముందుకు సాగే విషయమై ఇంజినీరింగ్ విభాగం మల్లగుల్లాలు పడుతోంది. ఇదిలా ఉండగా, గ్రేటర్‌లోని 30 సర్కిళ్లకు 200 మంది కావాలని బల్ది యా కోరగా, టీజీఎస్‌పీఎస్‌సీ ద్వారా 112 మంది ఏఈలను మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. 

ప్రాజెక్టులు సాగేదెట్లా.. 

రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌సిటీ పేరుతో గ్రేటర్‌లో రూ.7,032 కోట్ల వ్యయంతో రోడ్ల విస్తరణ, ఫ్లుఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం చేపట్టనుంది. మొత్తం 7 దశల్లో చేపట్టే 38 ప్రాజెక్టుల్లో కేబీఆర్ పార్క్ జంక్షన్లలో 7 ఫ్లుఓవర్లు, 7 అండర్ పాస్‌లను రూ. 1,090 కోట్లతో నిర్మించనుంది. ఈ నెల 3న ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా ఈ ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

రూ.5,942 కోట్ల వ్యయంతో మరో 23 పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభానికి టెండర్ల ప్రక్రియ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూసేకరణ పనులు సైతం ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ప్రక్రియలో ఉన్నతాధికారులు సీఈలు, ఎస్‌ఈల పాత్ర అత్యంత కీలకమైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోనే నలుగురు ఎస్‌ఈలతో పాటు ముగ్గురు ఈఈలు, 13 మం ది డీఈలు మొత్తం 20 మంది ఇంజినీరింగ్ అధికారులు రిటైర్మెంట్ అయ్యారు.

ప్రస్తుతం ముగ్గురు ఎస్‌ఈలు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులో ప్రాజెక్టు ల విభాగం సీఈ, ఇంచార్జ్ ఇఎన్‌సీ దేవానం ద్ రిటైర్మెంట్ కానున్నారు. దీంతో ప్రాజెక్టుల నిర్వహణకు సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు లేకుంటే ప్రాజెక్టుల పురోగతి ఎలా సాధ్యం అవుతుందంటూ బల్దియా వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. 

200 మంది కావాలంటే.. 

గత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏండ్ల నుం చి 61 ఏండ్లకు పెంచింది. దీంతో జీహెచ్‌ఎంసీలో అప్పటికే ఉన్న సీనియర్ ఇంజి నీరింగ్ అధికారులు అదనంగా మూడేళ్లు కొనసాగాల్సి వచ్చింది. దీంతో కొత్తగా ప్రమోషన్లు లేకపోవడం, నూతన రిక్రూట్మెంట్ లేనందున అప్పటికే ఉన్న అధి కారులు మాత్రమే కొనసాగుతూ వచ్చా రు.

ఈ క్రమంలో ఒక్కొక్కరూ రిటైర్మెంట్ అవుతున్నారు. ఈ ఏడాదిలోనే 20 మం ది ఇంజినీరింగ్ అధికారులు రిటైర్మెంట్ కావాల్సి ఉండగా వారి స్థానంలో ఉన్నతాధికారులు రాకపోవడంతో ప్రస్తుతం ఉన్నవారికే అదనపు బాధ్యతలతో నడుపుతున్నారు. జోన్లు, సర్కిళ్ల స్థాయిలోనూ ఇంజినీరింగ్ అధికారులు అంతంత మాత్రమే ఉన్నారు.

గ్రేటర్‌లోని మొత్తం 30 సర్కిళ్లకు, 6 జోన్లలో మొత్తం 200 మంది ఏఈలు కావాలని బల్దియా ప్రభుత్వానికి లేఖ రాయగా, టీజీఎస్‌పీఎస్‌సీ ద్వారా 112 మందిని మాత్రమే కేటాయించింది. దీంతో ఇటు కింది స్థాయి లోనూ, అటు ఉన్నత స్థాయిలోనూ ఇంజినీరింగ్ అధికారుల కొరతతో బల్ది యా సతమతమవుతోంది.

దీంతో ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్వహణలో సిబ్బంది, అధికారుల కొర త కారణంగా ప్రస్తుతం ఉన్న అధికారుల పై పనిభారం పెరుగుతూ ప్రాజెక్టుల నిర్వహణలోనూ మరింత జాప్యం అవుతున్నట్టు ఇంజినీరింగ్ అధికారులు భావిస్తున్నారు.