వేసవి రాకముందే నేటి ఎద్దడి...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పరిధిలోని పాల్వంచ మండలంలో వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి ఎద్దడి తాండవిస్తోంది. పాల్వంచ మండల పరిధిలో ఉన్నా పాండు రంగాపురం తండా గ్రామ పంచాయతీ గ్రామస్తులు గత రెండు నెలలుగా నీరు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయం. ఈ విషయమై అధికారులకు ఎంత మొర పెట్టుకున్న పట్టించుకున్న నాధుడే లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి విసుకు చెందిన ప్రజలు గురువారం గ్రామ పరిధిలో ఉన్నా బోర్ దగ్గర ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి వ్రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు, ఒకవైపు మిషన్ భగీరథ నీళ్లు గత వారం రోజులుగా రావటం లేదు అనీ, అలాగే పంచాయతీ నీళ్లు రాక రెండు నెలలు కావస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజి అస్తవ్యస్తంగా ఉన్నదని, విధి లైట్లు వెలగటం లేదని, అలాగే గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని ఎంపిడివో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ వీరబాబుకీ వినతి పత్రం అందించారు. స్పెషల్ ఆఫీసర్, గ్రామ కార్యదర్శి, యంపివో, యంపిడివో లు ఎవ్వరు స్పందించలేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గార్ల శ్రీను, రాము ఇట్టేబోయిన, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులోత్ భద్రు నాయక్, చల్లా లింగయ్య తదితరులు పాల్గోన్నారు. సమస్య పరిష్కారం చూపకపోతే ఖాళీ బిందెలతో ఆఫీస్ ముందు నిరసన ధర్నా చేస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.